బొలెరో వాహనానికి నిప్పు.. కేసు నమోదు

బొలెరో వాహనానికి నిప్పు.. కేసు నమోదు

NDL: కొలిమిగుండ్ల మండలం ఎర్రగుడి గ్రామంలో ఇవాళ సురేష్ అనే వ్యక్తికి చెందిన బొలెరో వాహనానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. బాధితుడు సురేష్ కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ రమేష్ బాబు సంఘటన స్థలానికి చేరుకొని బొలెరో వాహనాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్ బాబు పేర్కొన్నారు.