వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
KMR: లింగంపేట్ మండలం ఎల్లారాం గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించి పరిశీలించారు. హమాలీలు వరి ధాన్యాన్ని సంచుల్లో నింపి ప్యాక్ చేస్తున్న తీరును కలెక్టర్ స్వయంగా దగ్గరుండి పరిశీలించారు. వారితో మాట్లాడి వారు ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకున్నారు. వడ్ల ప్యాకింగ్, లారీ లోడింగ్ వేగంగా పూర్తిచేయాలని సూచించారు.