VIDEO: పరీక్ష కేంద్రాల్లో డీసీపీ తనిఖీలు
JN: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ తీరును డీసీపీ రాజమహేంద్ర నాయక్ బుధవారం స్వయంగా పర్యవేక్షించారు. పట్టణంలోని పలు కేంద్రాలను సందర్శించిన ఆయన, అక్కడ ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును, సీసీ కెమెరాల నిఘాను పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.