కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించిన ఎస్పీ

కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించిన ఎస్పీ

అన్నమయ్య: గాలివీడు మండలంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకమని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. గాలివీడు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఆయన ప్రారంభించారు. ఎస్సై నరసింహా రెడ్డి దాతల సహకారంతో మండలంలోని గ్రామాల్లో సుమారు 92 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాతలను జిల్లా ఎస్పీ ధీరజ్ ఘనంగా సన్మానించారు.