మహిళలు, బాలికల భద్రతకు 'భరోసా' పెద్దపీట

SRD: పోక్సో, అత్యాచారం కేసుల్లో మహిళలు, బాలికల భద్రతకు 'భరోసా' పెద్దపీట అని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. బుధవారం సంగారెడ్డిలోని భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటిగా 2016 మే 7న ఉమెన్ సేఫ్టీ వింగ్ డైరెక్ట్ ఆధ్వర్యంలో ఈ భరోసా కేంద్రం ప్రారంభించారని చెప్పారు.