VIDEO: బుడమేరు వంతెన వద్ద దట్టంగా గుర్రపుడెక్క

VIDEO: బుడమేరు వంతెన వద్ద దట్టంగా గుర్రపుడెక్క

కృష్ణా: ఉంగుటూరు-లంకపల్లి అగ్రహారం మధ్య బుడమేరు వంతెన వద్ద పేరుకుపోయిన గుర్రపుడెక్క మేట రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి చేరుతున్న మేట కారణంగా నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి సమీప గ్రామాల పంట పొలాలు తరచూ ముంపునకు గురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. గతంలో అధికారులు రసాయనాలతో నివారణకు ప్రయత్నించినా ఆశించిన ఫలితం రాలేదని వారు పేర్కొన్నారు.