VIDEO: శ్రీశైలంలో మొదలైన భారీ వర్షం
నంద్యాల జిల్లా పరిధిలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మొంథా తుఫాను చేసిన నష్టాన్ని మరవకముందే జిల్లాలో మళ్లీ వర్షం పడుతుండటం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. శ్రీశైలం, సున్నిపెంట, లింగాలగట్టు పరిధిలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి వాన మొదలైంది. అటు మల్లన్న భక్తులు సైతం వసతి గృహాలకే పరిమితమయ్యారు. రోడ్లన్నీ జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.