గ్యాస్ పేలుడు బాధితులకు తక్షణ సహాయం అందించాలి: MP

MDK: కౌడిపల్లి మండలం ముట్రాజ్ పల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక ఇల్లు ధ్వంసం అయ్యింది. ఈ ఘటనలో బాధిత కుటుంబ సభ్యులను MP రఘునందన్ రావు గురువారం పరామర్శించారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇవ్వడంతోపాటు జిల్లా కలెక్టర్‌తో HP గ్యాస్ మేనేజర్‌తో మాట్లాడి, తక్షణమే సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.