క్యూబా రాయబారితో శ్రీధర్ బాబు భేటీ
TG: రాష్ట్ర సచివాలయంలో క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ అగులేరాతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. 'తెలంగాణ-క్యూబా' మధ్య సత్సంబంధాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని శ్రీధర్ బాబు వెల్లడించారు. ద్వైపాక్షిక సహకారం ద్వారా నైపుణ్యాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుని ఉమ్మడి పురోగతి వైపు కలిసి నడుద్దామని పేర్కొన్నారు.