రేపు రామకుప్పంలో ఉచిత కంటి వైద్యశిబిరం

CTR: జిల్లా అంధత్వ నివారణ సంస్థ, కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం రామకుప్పంలో ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహిస్తున్నట్టు వళ్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయ కమిటీ పెద్దలు సీతాపతి తెలిపారు. ఆలయ ఆవరణలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ఈ శిబిరంలో నిపుణులైన కంటి వైద్యులు ఉచితంగా కంటి పరీక్షలు చేస్తామన్నారు.