VIDEO: శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం

NDL: శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో గడచిన 24 గంటల కాలంలో 32.119 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు అధికారులు తెలియాజేశారు. దీని కోసం జలాశయం నుంచి 69,862 క్యూసెక్కుల నీటిని వినియోగించామని, పోతిరెడ్డిపాడుకు 29,333 క్యూసెక్కులు, హెచ్ఎన్ఎస్ఎస్‌కు 2,426 క్యూసెక్కుల నీటిని ఇవాళ విడుదల చేశామన్నారు. 107 క్యూసెక్కుల నీరు ఆవిరైంది తెలిపారు.