బాబా మందిరంలో 40 ఏళ్ల వేడుకలు నేడు
హన్మకొండ నగరంలోని బాలసముద్రంలోని శ్రీ షిరిడి సాయి బాబా మందిరం 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. 1986లో స్థాపించబడిన ఈ మందిరంలో 1990లో విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. కార్యక్రమాలకు నగర ప్రముఖులు హాజరుకానుండగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ నిర్వాహకులు కోరారు.