గిరిజనులకు దుస్తులు పంపిణీ

గిరిజనులకు దుస్తులు పంపిణీ

ASR: చింతపల్లి మండలంలోని చెరువులవేనం మేఘాల కొండ మీద నివసిస్తున్న సుమారు 120 మంది గిరిజనులకు పర్యాటక శాఖ మేనేజర్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో మంగళవారం చీరలు, పంచెలు, దుస్తులు పంపిణీచేశారు. విశాఖ ఏయూ ఇంజినీర్స్, సాన్ ఛారిటీ సహకారంతో సమకూర్చిన దుస్తులు పంపిణీ చేశామని అప్పలనాయుడు తెలిపారు. పర్యాటక సీజన్ కావడంతో చెరువుల వేనంకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారన్నారు.