ఇల్లు కూల్చి, ఆస్తి నష్టం చేసిన వ్యక్తులపై ఫిర్యాదు

ఇల్లు కూల్చి, ఆస్తి నష్టం చేసిన వ్యక్తులపై ఫిర్యాదు

KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టుకు చెందిన బోర్రగళ్ల స్వరూప అద్దెకు ఉంటున్న గదిని, టీ స్టాల్‌ను కూల్చివేయడంపై కేశవపట్నం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గత 8 నెలలుగా ఆమె నరాల వెంకటనర్సు‌కు చెందిన గదిని అద్దెకు తీసుకుని టీ స్టాల్‌తో జీవనం సాగిస్తోంది. అయితే, ఇదే గ్రామానికి చెందిన శంకరయ్య ఆమెపైన కక్షతో గదిని, హోటల్ సామాగ్రిని కూల్చివేశాడు.