ర్యాపిడోపై చర్యలు తీసుకోవాలి: ఆటో డ్రైవర్ల డిమాండ్
ATP: ర్యాపిడో సంస్థతో తాము నష్టపోతున్నామని అనంతపురం (ఆల్ ఆటో ట్రేడ్) యూనియన్స్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం యూనియన్స్ ఆధ్వర్యంలో జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో డీటీసీ వీర్రాజును కలిసి వినతిపత్రం సమర్పించారు. నాయకులు కృష్ణనాయక్, నరసింహులు పాల్గొన్నారు.