రేపు జీవన్‌రెడ్డితో భేటీ కానున్న కేటీఆర్
TG: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు జగిత్యాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డితో ఆయన భేటీ కానున్నారు. జీవన్ రెడ్డి BRSలో చేరుతారనే ప్రచారం నేపథ్యంలో KTR ఆయనతో భేటీ కానుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ అనంతరం జీవన్ రెడ్డి BRSలో చేరే అంశంపై స్పష్టత రానుంది.