రామయంపేటలో 22.14 శాతం పోలింగ్ నమోదు
MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. 9 గంటల వరకు 22.14 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.