భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన పట్టాభిరామ్
VSP: ఈనెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పరిశీలించారు. గురువారం ఆయన ఏయూలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక అధికారులు, సీఐఐ ప్రతినిధులతో మాట్లాడి ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.