ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ASR: మారేడుమిల్లి ఆశ్రమ బాలికల పాఠశాలను రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని ఆమె పరిశీలించారు. పిల్లలకు వేడి నీళ్లు ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు పరిశుభ్రంగా ఉండి అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలన్నారు.