చుండూరులో 'మీకోసం' కార్యక్రమం
BPT: చుండూరు పీఏసీఎస్ వద్ద 'మీకోసం' (PGRS) కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని, పారదర్శకంగా పనిచేయాలని సూచించారు.