పైప్ లైన్ వ్యర్ధాలను తొలగించాలని వినతి

పైప్ లైన్ వ్యర్ధాలను తొలగించాలని వినతి

ప్రకాశం: మర్రిపూడి మండలంలోని వేమవరం గ్రామం సమీపంలోని రామతీర్థం రిజర్వాయర్ వద్ద తాగునీటి పైపుల మరమ్మతులు చేసి, పగిలిన పైపుల వ్యర్థాలను అక్కడే వదిలివేశారు. దీనివలన పశువులు మేత కోసం పొలాలకు వెళ్లే సమయంలో పైపు ముక్కలు గుచ్చుకొని గాయాలు అవుతున్నాయని దీంతో పశువుల కాపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులు చేసిన వ్యర్థాలను అక్కడి నుంచి తొలగించాలని అన్నారు.