సీఎం పర్యటన స్థలం పరిశీలన
తిరుపతి: జిల్లా పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేదిక్ యూనివర్సిటీకి రానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు గారు హెలిప్యాడ్‌తో పాటు సమావేశం నిర్వహించనున్న మీటింగ్ ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, వేదిక్ యూనివర్సిటీ అధికారులకు భద్రత, సమన్వయ అంశాలపై సూచనలిచ్చారు.