రిపబ్లిక్ డే వేడుకల్లో గొల్లప్రోలు ఎస్సైకు అభినందనలు
KKD: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉత్తమ ప్రతిభకనబరిచినందుకు ఎస్సై రామకృష్ణను జిల్లా ఎస్పీ బిందు మాధవ్, కలెక్టర్ అపూర్వ భరత్ అభినందించారు. విధి నిర్వహణలో ఆయన కర్తవ్యనిష్ఠ, ప్రజలతో సానుకూల సంబంధాలు, శాంతిభద్రతల పరిరక్షణలో చేసిన సేవలను కొనియాడుతూ ప్రశంసాపత్రం అందజేశారు. భవిష్యత్తులోనూ ప్రజాసేవలో ముందుండాలని సూచించారు.