జిల్లా ఆణిముత్యం
NZB: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇందూరు క్రీడాకారిణి నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించింది. 51 కిలోల విభాగంలో చైనీస్ తైపి క్రీడాకారిణి గువోజీ జువాన్‌పై 5-0 తేడాతో ఆమె విజయం సాధించింది. గత 20 నెలలుగా ఫామ్‌లో లేని నిఖత్ మళ్లీ ప్రపంచ వేదికపై సత్తా చాటింది. ఈ విజయంతో జిల్లా క్రీడాకారులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.