VIDEO: బోరు నుంచి ఉబికి వస్తున్న నీళ్లు
JN: పాలకుర్తి మండలం ఈరవెన్ను వెన్ను గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జక్కుల ఐలయ్య అనే రైతుకు చెందిన బోరు మోటార్ నుంచి నీళ్లు ఉబికి వస్తున్నాయి. దీంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భూ గర్భజలాలు పెరిగి ఇలా వస్తున్నాయి అని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.