'ప్రతి ఒక్కరు రక్తదానానికి ముందుకు రావాలి'
NRML: అపోహలు వీడి రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. సోమవారం పట్టణంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో పాటు ఏఎస్పీలు అవినాష్, రాజేష్ మీనా, పోలీస్ సిబ్బంది, ప్రజలు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు.