పశువుల యజమానులకు నష్టపరిహారం
మార్కాపురం ప్రాజెక్ట్ టైగర్ ఆధ్వర్యంలో డిప్యూటీ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ రావుఫ్ IFS, SDFO నీరజ్ హన్స్ IFS పర్యవేక్షణలో అడవి జంతువుల వల్ల చనిపోయిన పశువుల యజమానులకు నష్టపరిహారం చెక్కులు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ.. అడవి జంతువులకు హాని చేయరాదు, అడవిలో నిప్పు పెట్టరాదు, అక్రమ వేటకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.