బొబ్బిలిలో కురిసిన వర్షం

బొబ్బిలిలో కురిసిన వర్షం

VZM: బొబ్బిలి పరిసరాల్లో ఇవాళ వాతావరణం అనూహ్యంగా మారింది. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు సాయంత్రం కురిసిన వర్షంతో  ఉపశమనం కలిగింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో వాన పడటంతో వాతావరణం చల్లబడింది. వేడి నుంచి ఉపశమనం లభించినా, ఇలా అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు రావడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.