మత్తులో యువత.. అదుపులోకి 8 మంది
కృష్ణా: వీరులపాడులోని పెద్దాపురం శివారులో గంజాయి తాగుతున్నారనే అనుమానంతో 8 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరు అల్లూరు, పెద్దాపురం గ్రామాలకు చెందిన యువకులుగా గుర్తించారు. వారిని స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అధికారులు మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. తహసీల్దార్ సమక్షంలో వారిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.