కాంగ్రెస్ పార్టీలో చేరిన పలు పార్టీల నేతలు

కాంగ్రెస్ పార్టీలో చేరిన పలు పార్టీల నేతలు

WGL: నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామానికి చెందిన వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వైనాల అశోక్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.