మొదలైన పోలింగ్.. బారులు తీరిన ప్రజలు
RR: శంకర్‌పల్లి మండల పరిధిలో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మండల పరిధిలో మొత్తం 24 గ్రామ పంచాయతీలు ఉండగా.. కొత్తపల్లి, పర్వేద గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 22 GPలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రామ సర్పంచ్ ఎన్నుకోడానికి ప్రజలు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు.