'మౌళిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తాం'
ప్రకాశం: ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ.. అభివృద్ధి కొనసాగిస్తామని కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం 14వ వార్డు పర్యటనలో ఆయన, పట్టణంలో మౌలిక సదుపాయాలను పెంపొందించడమే కాకుండా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.