27వ వార్డులో ఘనంగా మహిళా దినోత్సవం

27వ వార్డులో ఘనంగా మహిళా దినోత్సవం

SRPT: సృష్టికి మూలమైన మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వార్డు కౌన్సిలర్‌ చిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 27వ వార్డులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా శక్తిని కొనియాడారు. కార్యక్రమంలో టీచర్‌ శారద, నాగమణి తదితరులు ఉన్నారు.