VIDEO: సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో 9 వార్డు సభ్యులు జోగు రాధ సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో ఈజీఎస్ నిధుల నుంచి విడుదలైన రూ. 10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె తెలిపారు.