నందిపేట పీహెచ్సీని తనిఖీ చేసిన కలెక్టర్
NZB: నందిపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషంట్, జనరల్ వార్డులు, ఫార్మసీ, ల్యాబ్ తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీశారు. అనంతరం అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలన్నారు.