వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి
NDL: పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాలను అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.