దోమల నివారణకు శ్రీకారం

AKP: గొలుగొండ మండలం గాదంపాలెం పంచాయతీలో గురువారం సాయంత్రం దోమల నివారణకు శ్రీకారం చుట్టారు. గొలుగొండ పీహెచ్సీ, పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి వీధిలో దోమల నివారణకు దోమల మందును స్ప్రేయింగ్ చేశారు. ఇటీవల వర్షాలు పడుతున్న నేపథ్యంలో దోమలు పెరుగుతున్న కారణంగా ఈ చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు.