ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో కోట్లు కొట్టేసిన కిలాడీ!

ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో కోట్లు కొట్టేసిన కిలాడీ!

TG: FBలో మహిళ పేరుతో వచ్చిన ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ HYDకు చెందిన వీరభద్రరావు అనే టెకీని నిండా ముంచేసింది. ఓ మహిళ ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో అధిక లాభాలంటూ ఆశ చూపగా.. నమ్మిన వీరభద్రరావు ఓ యాప్‌ ద్వారా గత SEP-DEC కాలంలో ఏకంగా రూ.2.36 కోట్లు పెట్టుబడి పెట్టాడు. చివరకు లాభాలు రాకపోగా, పెట్టిన డబ్బు కూడా వెనక్కి రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.