VIDEO: రంగా విగ్రహ ఆవిష్కరణపై వివాదం

కోనసీమ: సఖినేటిపల్లి మండలం అంతర్వేదికరలో వంగవీటి రంగా విగ్రహాన్ని కాపు సంఘాలు ఏర్పాటు చేయగా ఆ విగ్రహానికి పర్మిషన్ లేదు అంటూ పోలీసులు తొలగించటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పంచాయతీ నుంచి పర్మిషన్ ఉందని చెప్తున్నా విగ్రహం తొలగించడంతో కాపు సంఘాల నేతలు, మహిళలు తెల్లవారుజాము నుంచి ఆందోళన చేపట్టి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.