శతజయంతి విజయవంతం.. కలెక్టర్, ఎస్పీ అభినందన
సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు విజయవంతం కావడంపై శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్, ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ సాయి ఆరామంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. అన్ని శాఖల సమన్వయం, సాయి ట్రస్ట్ సహకారం అద్భుతమని కలెక్టర్ పేర్కొన్నారు. లక్షలాది మంది భక్తులు పాల్గొన్న ఈ వేడుకల్లో భద్రతా చర్యలు అత్యుత్తమంగా ఉన్నాయని ఎస్పీ ప్రశంసించారు.