చిమ్మిరిబండలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి
BPT: మార్టూరు మండలం చిమ్మిరిబండ గ్రామంలో గురువారం పిడుగుపాటుకు గురై దుడ్డు కొర్నేలు అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఆయన గురువారం పొలంలో పనిచేస్తుండగా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో అతనిపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పశుకాపర్లు గమనించి VROకు సమాచారం అందించారు. ఆయన మృతితో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.