కొల్లూరులో కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందబాబు

కొల్లూరులో కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందబాబు

BPT: నీటి భద్రత–సాగు నీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలో లాక్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు లాంఛనంగా ప్రారంభించారు. చెరువుల పునరుద్ధరణ, కాలువల అనుసంధానం, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ చర్యలను క్షేత్రస్థాయిలో వేగవంతంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.