'మీటర్ రీడర్‌లకు ఉద్యోగ భద్రత కల్పించాలి'

'మీటర్ రీడర్‌లకు ఉద్యోగ భద్రత కల్పించాలి'

విశాఖపట్నం గాంధీ విగ్రహం వద్ద విద్యుత్ మీటర్ రీడర్‌లు చేపట్టిన నిరసన మంగ‌ళ‌వారం కూడా కొన‌సాగింది. శిబిరానికి ఏఐటీయూసీ విశాఖ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి డాక్టర్ బూసి వెంకటరావు మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న క్షేత్రస్థాయి సిబ్బందిని 'ఎనర్జీ అసిస్టెంట్'లుగా నియమించాలని డిమాండ్ చేశారు.