అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి
KMM: కల్లూరు మండల కేంద్రంలోని మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు జరిగాయి. మెయిన్ సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాగమయి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి అంబేడ్కర్ చేసిన సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు.