సౌత్‌లో ఎంట్రీ ఇస్తున్న హృతిక్ రోషన్

సౌత్‌లో ఎంట్రీ ఇస్తున్న హృతిక్ రోషన్

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తన అభిమానులకు కీలక అప్‌డేట్ ఇచ్చారు. తన స్వీయ దర్శకత్వంలోని ‘క్రిష్ 4’ను ప్రస్తుతానికి పక్కనపెట్టిన ఆయన, కన్నడ నిర్మాణ సంస్థ 'హోంబలే ఫిల్మ్స్‌'తో ఓ భారీ ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది హృతిక్ కెరీర్‌లోనే తొలి సౌత్ ఇండియన్ సినిమా. ఈ చిత్రం పూర్తయ్యాకే ‘క్రిష్ 4’ పట్టాలెక్కుతుందని సమాచారం.