'ఆక్రమణల క్రమబద్ధీకరణ వేగవంతం చేయాలి'
విశాఖ జిల్లాలో ఆక్రమణల క్రమబద్ధీకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన వారికి ఈనెల 18లోగా పట్టాలు పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. అలాగే, మిగిలిన దరఖాస్తులను మార్చి 31లోగా పరిష్కరించాలని సూచించారు.