'రైతు సుఖంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది'
VZM: రైతు సుఖంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు. బుధవారం గరివిడిలో నూతనంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా పారదర్శకంగా, ప్రభుత్వ కనీస మద్దతు ధరతో నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు.