నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మాజీ కౌన్సిలర్
నల్గొండ పట్టణంలో అనారోగ్యంతో మృతి చెందిన కుంచం రాజు కుటుంబానికి స్థానిక మాజీ కౌన్సిలర్ గోగుల శ్రీనివాస్ రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. పెద్దబండకు చెందిన రాజు మృతితో ఆయన కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. వారి నివాసానికి చేరుకున్న ఆయన మృతుడికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియల ఖర్చుల కోసం ఈ సాయం అందించారు.