WONDER: ఒకేలా ఇద్దరి ఫింగర్ ప్రింట్స్!
ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవని మనకు తెలిసిందే. కానీ తొలిసారిగా యూపీ కాన్పూర్‌లో కవలలు ప్రబల్, పవిత్ర మిశ్రాల ఫింగర్ ప్రింట్లు, రెటీనా సరిపోలినట్లు తెలుస్తోంది. ఒకరి ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేయగా మరొకరిది డియాక్టివేట్ అయింది. జన్యుపరంగా కవలల్లోనూ ఇలా మ్యాచ్ కావడం అసాధ్యమని నిపుణులు తెలిపారు. ఇది సాంకేతిక లోపమా? నిజంగానే సేమ్ ఉన్నాయా? అని విచారిస్తున్నారు.