కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎంపీడీవోలు
NRML: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌ను మంగళవారం నూతన ఎంపీడీవోలు మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రూప్-1లో అర్హత సాధించిన నలుగురు ఎంపీడీవోలు తమ కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్‌ను కలిశారు. కలెక్టర్ వారికి శుభాకాంక్షలు తెలియజేసి, విధుల్లో క్రమశిక్షణతో పనిచేసి ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేయాలని సూచించారు.